వైరల్ అవుతున్న బండ్ల కోడి ముద్దు

బండ్ల గణేష్ ఈ పేరు మీడియాలో ఎప్పుడు వైరలే..సినిమా ఫంక్షన్ లో ఈయన మాటలైనా..రాజకీయ మాటలైనా సరే ఆయన మాట్లాడాడంటే అది వైరల్ కావాల్సిందే. ఈ మధ్య 7 ఓ క్లోక్ బ్లెడ్ తో ఫుల్ పాపులర్ అయినా గణేష్..తాజాగా కోడి ముద్దు తో మరోసారి వార్తల్లో నిలిచారు.

మొన్నటి వరకు కరోనా దెబ్బ కు చికెన్ రేట్లు పూర్తిగా పడిపోయిన సంగతి తెలిసిందే. చాల చోట్ల ఫ్రీ గా కోళ్లను ఇవ్వాగా..కేజీ చికెన్ పది , ఇరవై రూపాయలకే అమ్మడం జరిగింది. ఇక మూడు రోజుల క్రితం నుండి మళ్లీ కోళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్లు తినండి..చికెన్ తినండి కరోనా రాదని చెప్పడం తో మళ్లీ చికెన్ సెంటర్ వద్ద ప్రజలు బారులు తీరారు. అంత బాగానే ఉన్న టైం లో బండ్ల గణేష్ ఓ ట్వీట్ చేసాడు.

కోళ్ల ఫారంలో కోళ్లను ముద్దాడుతూ.. ‘మా పరిస్థితి ముందుకేల్తే గొయ్యి వెనుకకి వెళ్తే నుయ్యి లా ఉంది. కోట్లు పెట్టుబడి పెట్టాము.. భయంగా వుంది దీయబ్బ కరోనా’ అంటూ ట్వీట్ చేశారు. అయితే బండ్ల గనేష్ చేసిన ట్వీట్ల మీద పంచ్‌లు పేలుతున్నాయి. అందేది బండ్లన్నా.. కేసీఆర్ కేటీఆర్ చికెన్ తినండి గుడ్డు తినండి అని యాడ్స్ ఇస్తుంటే నీకేంటి బాధ అంటూ జోక్‌లు వేస్తున్నారు.

టెన్షన్ పడకు బ్రో. డొనాల్డ్ ట్రంప్ నీ క్లోజ్ ఫ్రండే కదా.. కేఎఫ్‌సీకి బదులు నీ కోళ్ల ఫార్మ్‌ని ప్రమోట్ చేయమని చెప్పు. అయినా కోళ్లను చంపడానికే కదా నువ్ అమ్మేది.. మళ్లీ వాటికి ఆ కిస్‌లు పెడుతూ షో చేస్తున్నావ్ ఎందుకు బండ్లా.. ఓ పని చేయి బండ్లా ఓ కోటీ రూపాయిలు కరోనా నియంత్రణకు డొనేష్ చేయి నీ సమస్య పరిష్కారం అయిపోతుంది అంటూ బండ్ల గణేష్‌ను ఆడుకుంటున్నారు. మొత్తంమీద గణేష్ మరోసారి వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ అయ్యాడు.