కరోనా దెబ్బకి దేశం మొత్తం స్తంభించిపోయింది. అయితే మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడగించే ఆలోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిరాధారమైనవని తెలిపింది. ‘‘ లాక్‌డౌన్ పొడగింపుఊహాగానాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. లాక్‌డౌన్ పొడగించే యోచనేమీ లేదు’’ అని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా స్పష్టం చేశారు.
ఇదీలావుంటే .. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌ల సంఖ్య పెంచామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 47 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతిచ్చామని వెల్లడించింది. ప్రస్తుతం 113 ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 35 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.