కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ మూతపడింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది.
ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్ధిక సాయాన్ని అందజేస్తుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటి ద్వారా సినీ కార్మికులను ఆదుకునే పని చేస్తున్నారు.
చిరంజీవి ఆధర్యంలో సురేష్ బాబు, నేను, ఎన్.శంకర్, కల్యాణ్, దాము అందరం కలిసి చిన్న కమిటీగా ఏర్పాటయ్యి సీసీసీ అనే సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. దీనికి నాందిగా మొదట చిరంజీవి కోటి రూపాయలను ప్రకటించారు. నాగార్జున కోటి రూపాయలు, ఎన్టీఆర్ రూ. 25 లక్షలు రవితేజ రూ. 20 లక్షలు మొదలగు స్టార్స్ తమవంతు సాయం చేయగా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా 50 లక్షల భారీ విరాళం అందజేసి తన గొప్ప తనాన్ని చాటుకున్నారు. ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టే కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా 4కోట్ల రూపాయలు ప్రభాస్ విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.