మంచు మనోజ్ రీసెంట్ గా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్..విడాకులు తీసుకోవడం ఏంటి అని అంత ఆరా తీశారు. కానీ విడాకులకు కారణం ఏంటి అనేది మాత్రం మనోజ్ తెలుపలేదు. ఈ నేపథ్యంలో విష్ణు మనోజ్ విడాకుల ఫై స్పందించారు.
గత కొంతకాలం గా హిట్ లేని మంచు విష్ణు..తాజాగా జెఫ్రె చిన్ డైరెక్షన్లో మోసగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు . తెలుగు , ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. తాజాగా విష్ణు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలపై మాట్లాడాడు విష్ణు. ముఖ్యంగా తమ్ముడు మనోజ్ విడాకుల గురించి కూడా స్పందించాడు విష్ణు. తన తమ్ముడు భార్యతో విడిపోతున్నాడని తెలిసినపుడు తామేం మాట్లాడలేదని.. అది అతడి జీవితం అనేసాడు విష్ణు. అయితే ఏదేమైనా కూడా తమ్ముడు విడాకులు తీసుకున్న తర్వాత తాను అతడికి చెప్పిన ఒకే ఒక్క మాట.. టేక్ యువర్ ఓన్ టైమ్ అని మాత్రమే అన్నాడు విష్ణు. ఎందుకంటే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్లోనో, డిప్రెషన్లోనే ఉంటారు.. అలాంటి సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని చెప్పుకొచ్చాడు విష్ణు.