తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. దీంతో రెండు రాష్ట్రాలు లాక్ డౌన్ చేస్తూ కరోనా కు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను మోడీ ప్రకటించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోనే ఉండాలని ముఖ్యమంత్రులు సూచించారు. దీంతో రోజు వారి కూలి చేసుకుని బ్రతికే వారికీ ఇబ్బందిగా మారింది.
ఈ నేపథ్యంలో సినీ , రాజకీయ నేతలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ , క్రీడా , రాజకీయ నేతలు తమ విరాళాలు ప్రకటించగా..తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కూడా కరోనా సాయం కోటి ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలకు రూ.30 లక్షల చొప్పున విరాళం ప్రకటించింది. అలాగే ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున హెరిటేజ్ ఫుడ్స్ విరాళం ప్రకటించింది. అంతకుముందే చంద్రబాబు తనవంతు కరోనా సాయంగా రూ. 10లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే.