ఏపీ లో బియ్యం కోసం బారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తిండి లేక , పనులు లేక నానా తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ నెలకు మూడు సార్లు బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు ప్రజలకు అవసరమైన ఐదు కేజీల బియ్యం, ఒక కేజీ కంది పప్పును రేషన్ దుకాణాల ద్వారా అందించడం స్టార్ట్ చేసింది

దీంతో ప్రజలు తెల్లవారుజాము నుంచే రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటిస్తూ ఎదురుచూశారు. కానీ తీరా సరుకులు పంపిణీ చేసే సమయంలో బయోమెట్రిక్ సాఫ్ట్‌వేర్ పనిచేయలేదు. ఫలితంగా సకాలంలో రేషన్ డీలర్లు సరుకులను అందజేయలేకపోయారు. దీంతో రేషన్ దుకాణాల వద్ద అమాంతంగా క్యూలైన్లు పెరిగిపోయాయి. క్యూలైన్లు పెరగడంతో ప్రజలతో నిండిపోయింది.