మిస్టర్ పెళ్ళికొడుకు… ‘భీమవరం బుల్లోడు’

sunil bhimavarm bulloduమిస్టర్ పెళ్లి కొడుకు సునీల్ ఇప్పుడు ‘భీమవరం బుల్లోడు’ గా అల్లరి చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఉదయశంకర్ దర్శకత్వం వహించ బోతున్నారు.
సునీల్ సరసన ఎస్తర్ అనే కొత్త అమ్మాయి హీరొయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. ‘‘సురేష్  ప్రొడక్షన్స్ లో చాలా సినిమాల్లో నటించాను. హీరోగా ఈ బ్యానర్లో నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ విత్ పాన్, ఐస్ క్రీమ్ లా ఉంటుందని, నా సినిమాల్లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు. దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ… ఎంటర్‌టైన్మెంట్ అండ్ కామెడీకి ఫుల్ స్కోపు ఉన్న ఈ కథకి సునీల్ సరిగ్గా నప్పుతాడని అన్నారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. సునీల్ తో ఎప్పటి నుంచో మా బ్యానర్లో సినిమా చేయాలనుకుంటున్నాము. ఈ రోజుతో అది కుదిరింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి విశేషాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మణిశర్మ.