‘గ్రీకువీరుడు’ పాటల సందడి@ స్టీల్ సిటీ

nagarjuna in greekuveeruduదశరధ్ దర్శకత్వం లో నాగార్జున, నయనతార జంటగా నటించిన కలర్ ఫుల్ రొమాంటిక్  చిత్రం ‘గ్రీకువీరుడు’. తమన్ మ్యూజిక్ అందించిన ఈచిత్రం ఆడియో ను మార్చి 23న స్టీల్ సిటీ వైజాగ్ లో నిర్వహిస్తున్నట్లు సమాచారం.ఇక చిత్రంలో నాగార్జున ఓ ఈవెంట్‌  మేనేజర్ ఎన్నారైగా, డిఫరెంట్ గెటప్ లో స్టైలిష్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి విశేష స్పందన లభిస్తుంది. టీజర్ లో నాగ్ చేసే డాన్సులు ఆకట్టుకుంటున్నాయి. నాగ్ ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ గాళ్ వుండడం, సంతోషం లాంటి హిట్ చిత్రాన్ని అందించిన నాగ్-దశరథ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక మూవీ ఏప్రిల్ 19న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.