నితిన్ కు కరోనా దెబ్బ…

కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా దెబ్బ కు ఇంట్లోనుండి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఇతర దేశాల్లో ఎక్కువగా గడిపే వారు సైతం ఎలాంటి టూర్స్ ప్లాన్ చేయడం లేదు. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ నితిన్ పెళ్లి ఫై పడింది. ఏప్రిల్ 16 న నితిన్ దుబాయి లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ అంతటా ఉండడం తో పెళ్లి ని వాయిదా వేయడమా..లేక హైదరాబాద్ లో చేసుకోవడమా అనే ఆలోచనలో ఉన్నాడట. దీనిపై అతి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా భీష్మ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.