భీష్మ కు బంటు విషెష్..

నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భీష్మ’. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు నితిన్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా వసూళ్లు రాబడుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర విజయం ఫై సినీ ప్రముఖులు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ తమ స్పందనను తెలుపుగా ..తాజాగా అల్లు అర్జున్ నితిన్ కు డబల్ విషెష్ అందించారు.

డైరెక్టర్ వెంకీ , రష్మిక లకు విషెష్ అందించిన బన్నీ..త్వరలో నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతుండడం తో డబల్ విషెష్ అందించాడు బన్నీ. రీసెంట్ గా బన్నీ అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు.