వెంకీమామ తో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్..ప్రస్తుతం సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తమిళ్ మూవీ అసురన్ రీమేక్ నారప్ప లో నటిస్తున్నాడు. ఈ సినిమాను వి క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సురేష్ బాబు, కలైపులి యస్ థానులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసి ఆసక్తి నింపారు. ఈ లుక్ లో వెంకటేష్ ఊర మాస్ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్ ప్రైజ్ చేశారు. తమిళ్లో ఈ పాత్రను ధనుష్ చేయగా.. తెలుగులో వెంకటేష్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీన్స్ తమిళనాడులోని కురుమలైలో జరుగుతున్నాయి. ఇంటెర్వెల్ ఫైట్ కోసం ఏకంగా 10 రోజులు షూటింగ్ జరిపారట. ఈ పోరాట సన్నివేశాన్ని ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో తమిళనాడులోని 12000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రెడ్ డెసర్ట్ అనే ప్రాంతంలో ఈ ఫైట్ కంపోజ్ చేశారు.
కాగా ఈ మూవీ లో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుండగా..మరో హీరోయిన్ గా అమలా పాల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ: వెట్రిమారన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్, లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం.