పవన్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన నితిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు హీరో నితిన్ ఎంత పెద్ద అభిమానో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తుంటాడు. తాజాగా తాను నటించిన భీష్మ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ నటిస్తున్న చిత్ర తాలూకా అప్డేట్ ను ఇచ్చి పవన్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పవన్ రి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో పింక్ రీమేక్ ఒకటి.

వేణు శ్రీ రామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ మే నెలలో రిలీజ్ కాబోతున్నట్లు నితిన్ పబ్లిక్ గా ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ మూవీ మేలో విడుదల కానుందని, వీరాభిమానులుగా మనం చొక్కాలు చించుకోవడానికి, ఈలలు వేసి గోల చేయడానికి సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చాడు.