పోలీసులకే మెగా కోడలు పాఠాలు..

మెగా కోడలు ఉపాసన ఎప్పుడు వార్తల్లో ఏదో ఒక వార్త తో మీడియా లో నిలుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా లోను ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ సామజిక అంశాలతో పాటు చరణ్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె తెలంగాణ పోలీసుల కోసం యోగా పాఠాలు నేర్పే ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది.

అపోలో హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా నిపుణుడు ఎడ్డీ స్టెర్న్ ఆధ్వర్యంలో పోలీసులకు యోగాసనాలు నేర్పించారు. నిరంతరం ప్రజా సేవలో ఉండే పోలీసులు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలని చాటే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యోగా కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన ఫాలోవర్లతో పంచుకున్నారు.