భీష్మ ట్రైలర్ టాక్

నితిన్ -రష్మిక జంటగా వెంకీ కుడుమల డైరెక్షన్లో నటించిన చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరి 21 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలు స్పీడ్ చేసారు.

ఇప్పటికే విడుదలైన వీడియోస్ ఆకట్టుకోగా..సోమవారం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి ఇంకాస్త అంచనాలు పెంచారు. ట్రైలర్ విషయానికి వస్తే.. సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్టు అర్థమైపోతోంది. దుర్యోధన్, దుశ్శాసన్, ధర్మరాజ్, యమధర్మరాజ్, శని, శకుని ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దానివల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదు’’ అనే డైలాగుతో ట్రైలర్ మొదలై ఆసక్తి పెంచింది. ట్రైలర్ లో రొమాన్స్ , యాక్షన్ , కామెడీ , డైలాగ్స్ ఇలా అన్ని ఆకట్టుకోగా..నువ్వు ఎన్ని నెలల్లో పుట్టావ్? ఆరు నెలల్లో పుడితే నిన్ను ఏమంటారో తెలుసా? నెల తక్కువ వెధవ అంటారు’’ అంటూ విలన్ జిషుతో నితిన్ చెప్పే డైలాగ్ అంచనాలు పెంచింది. ఓవరాల్ గా ట్రైలర్ అందరిని ఆకట్టుకోవడమే కాదు సినిమా ఫై ఆసక్తి పెంచింది.