పవన్ కు మ్యాస్ట్రో మ్యూజిక్?

pavan kalyan illyarajaఇళయరాజా… సినీ సంగీత ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. తారలు మారుతున్నా, తరాలు మారుతున్నా తరగని సంగీతగని మాస్ట్రో ఇళయరాజా. ఆయన సంగీతం సమకూరుస్తున్నారంటే చాలు ఆ సినిమాకు అదే ఓ పెద్ద క్వాలిఫికేషన్. సుమారు మూడు దశాబ్దాల కాలం పాటు సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నా… శ్రోతలకు విసుగు కలిగించని స్వర సంపద రాజా సొంతం. విలక్షణ మైన కధ కుదిరినప్పుడు దర్శకుల మొదటి ఛాయిస్ ఇళయరాజా. మాస్ట్రో అయితేనే ఈ సినిమాకు పూర్తి న్యాయం జరుగుతుందని సదరు దర్శకుల అభిప్రాయం. ఇప్పుడు ఆ లిస్టు లో విలక్షణ దర్శకుడు క్రిష్ చేరిపోయారు. అవును .. క్రిష్ పవన్ తో చేసే ప్రాజెక్ట్ కు సంగీత దర్శకుడు గా ఇళయరాజా ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. కధ ప్రకారం మాస్ట్రో అయితేనే న్యాయం చేయగలరని యూనిట్ సభ్యలు బావిస్తున్నారట. పవన్ కుడా తన చిత్రాలకు సంబంధించి సంగీతం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇళయరాజా విషయంలో పవన్ సుముఖంగా ఉన్నారని భోగట్టా. పవన్ ప్లీడర్ గా దర్శనమిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. గతంలో ప్లీడర్ నేపధ్యం లో వచ్చిన ‘చెట్టు కింద ప్లీడర్’ చిత్రానికి ఇళయరాజా మ్యూజిక్ అందిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ చిత్రం అదే నేపధ్యంలో వస్తుండడంతో ఈ వార్తకు బలంచేకూరుతుంది.