సునీల్ మరో అవతారం..ఈసారి ఏమవుతుందో..

కమెడియన్ గా కెరియర్ మొదలు పెట్టిన సునీల్..ఆ తర్వాత హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగా రెండు , మూడు సినిమాలు హిట్ అయినప్పటికీ తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యేసరికి..అవకాశాలు రాకుండాపోయాయి. ఈ మధ్యనే మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. చిత్రలహరి సినిమాతో మళ్లీ హిట్ అందుకున్న ఈయన..ప్రస్తుతం అల వైకుంఠపురం లో నటిస్తున్నాడు.

ఇప్పటికే కెరీర్ ను పలు మలుపులు తిప్పుకున్న సునీల్.. ఈసారి ఇంకో భిన్నమైన టర్న్ తీసుకున్నారు. ఇన్నాళ్ళు హాస్యనటుడిగా, కథానాయకుడిగా అలరించిన ఆయన ఇప్పుడు విలన్ గా కొత్త అవతారం ఎత్తుతున్నారు. సుహాస్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో ‘కలర్ ఫోటో’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రేమ కథలో సునీల్ విలన్ పాత్రలో కనిపిస్తారట. మరి హీరోగా సక్సెస్ కాలేకపోయినా సునీల్..విలన్ గా సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి.