దర్బార్ ప్రీ రిలీజ్ వేడుక ఫిక్స్..

సంక్రాంతి బరిలో అల..వైకుంపురం లో , సరిలేరు నీకెవ్వరూ తో పాటు దర్బార్ , ఎంత మంచివాడవు రా చిత్రాలు కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. అందరి కంటే ముందు రజనీకాంత్ దర్బార్ తో సంక్రాంతి సందడిని మొదలు పెట్టబోతున్నాడు. తెలుగు , తమిళ్ భాషల్లో ఈ మూవీ జనవరి 09 న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక డేట్ ను ఫిక్స్ చేసారు చిత్ర యూనిట్.

జనవరి 3వ తేదీన హైదరాబాద్ లోని శిల్ప కళ వేదిక లో ఈ వేడుకను గ్రాండ్ గా జరపబోతున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో రజనికి జోడిగా నయనతార నటిస్తుండగా.. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటిస్తున్నాడు. నివేద థామస్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.