అనాధ పిల్లలతో వెంకీమామ సందడి..

నాగ చైతన్య , వెంకటేష్ హీరోలుగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం వెంకీమామ. ఈ సినిమా డిసెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు పరుగులు పెట్టించింది.

ఎమోషనల్ , కామెడీ , లవ్ ఇలా అన్ని ఉండడం తో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఇష్టపడుతున్నారు. తాజాగా వెంకటేష్ ఆర్ఫనేజ్ పిల్లలతో కలిసి సినిమా చూసారు. వెంకీమామ తో సినిమా చూసి పిల్లలు ఎంతో సంతోష పడ్డారు. ఎమోషనల్ గా వెంకీ ని హగ్ చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది.