యూట్యూబ్ ను దడదడలాడిస్తున్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్ – సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో లైకా ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 09 న తమిళ్ , తెలుగు భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు.

ట్రైలర్ ఆలా రిలీజ్ అయ్యిందో లేదో యూట్యూబ్ లో షేక్ చేయడం మొదలు పెట్టింది. గంట గంటకు రికార్డ్ వ్యూస్‌ సాధిస్తూ ట్రైలర్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. రిలీజ్ అయిన 12 గంటల్లో దాదాపు 12.4 మిలియన్ల (కోటీ 24 లక్షల) వ్యూస్‌ అన్ని భాషలు కలిపి సాధించింది. అంటే ప్రతీ గంటకు పది లక్షలకు పైగా వ్యూస్‌ సాధిస్తోంది.

చాలా కాలం తరువాత రజనీ యంగ్‌ అండ్‌ యాంగ్రీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించడం.. రజనీ మార్క్‌ స్టైల్‌ మిస్‌ కాకుండానే తనదైన టేకింగ్‌తో డైరెక్టర్ అదరగొట్టడం.. ట్రైలర్‌లో యాక్షన్‌ హైలెట్‌గా ఉండడం ఇవన్నీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి. మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.