శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601
మేషం :
ఉమ్మడి, ఆర్థిక విషయాల్లో ఏకాగ్రత అవసరం, మీ సంతానం ఉద్యోగ వివాహ విషయాల పట్ల జాగ్రత్త వహిస్తారు. స్త్రీలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం, వృత్తి వ్యాపార, వ్యవహారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి, తలపెట్టిన పనులు అనుకున్నవిధంగా పూర్తి చేస్తారు. స్త్రీలు ప్రతిభా పోటీల్లో రాణిస్తారు.
వృషభం :
బంధువుల రాక వల్ల మీరు కొంత అసౌకర్యానికి లోనవుతారు. భూగస్వామిక చర్చల్లో పురోగతి ఉంటుంది. రుణయత్నాల్లో ప్రతికూలత ఎదుర్కొంటారు. ఒకానొక సందర్భంలో మిత్రుల తీరు నిరుత్సాహ పరుస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బ్యాంకు పనులు వాయిదా పడతాయి.
మిథునం :
స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ప్రముఖుల కలయికతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాంఘిక సాంస్కృతి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం :
పత్రికా సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. గృహ నిర్మాణాలు మమ్మతులు అనుకూలిస్తాయి. స్త్రీలకు టీవీ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.
సింహం :
ఉద్యోగస్తులు అధికారులకు శుభాకాంక్షలు, విలువైన కానుకలందించి వారి అభిమానాన్ని సంపాదిస్తారు. మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ది పొందుతారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
కన్య :
ఉన్నతస్థాయి అధికారులు తమ గౌరవ ప్రతిష్టతలకు భంగం కలుగకుండా మెలగవలిసి ఉంటుంది. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. విదేశాల్లోని ఆత్మీయులకు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేస్తారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం.
తుల :
బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో నగదు డ్రా చేసే విషయంలో జాగ్రత్త. పాత పరిచయస్తుల కలయికతో మీలో మార్పు వస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఒక విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
వృశ్చికం :
కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కాగలవు. స్నేహితుల వల్ల ఇబ్బందులెదుర్కునే పరిస్థితులు ఎదురవుతాయి. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులు వేడుకల్లో మితంగా వ్యవహరించడం శ్రేయస్కరం. ప్రేమికుల అతిగా వ్యవహించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
ధనస్సు :
ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. కొన్ని అంశాలు నచ్చకపోయినా సర్దుకుపోవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి.
మకరం :
హోటల్, కేటరింగ్ రంగాల్లోని వారు పనిభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితులు మిమ్మలను ఉద్రేకపరిచి మీచే ధనం విపరీతంగా వ్యయం చేయిస్తారు. ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఆత్మీయులకు శుభాకాంక్షలు, కానుకలు అందజేస్తారు. విదేశీయానం అనూకూలం.
కుంభం :
దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాగ్వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఉన్నతస్థాయి అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రిటంగ్, రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దుబారా ఖర్చులు అధికం.
మీనం :
విద్యార్థుల్లో మందకొండితనం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు చోటు చేసుకుంటాయి. వ్యాపకాలు తగ్గించుకుని ఉద్యోగ, వ్యాపారాలపై దృష్టి సారించండి. స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. ప్రముఖుల కలయిక వల్ల ప్రయోజనం ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.
శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601