శంకర్ చూపు… మహేష్ వైపు

Mahesh-and Shankarశంకర్ తో సినిమా చేయాలని మహామహులే ఎదురుచూస్తున్న వేళ… ఆయన మాత్రం మన ప్రిన్స్ కోసం కళలు కంటున్నారు, కధలు రాస్తున్నారు. అవును… శంకర్ ఇప్పుడు మహేష్ తో జతకట్టడానికిఉత్సాహ పడుతున్నాడు. ఇదివరకు ‘స్నేహితులు’లో నటిం మని అడిగినా.. మహేష్ సున్నితంగా తిరస్కరించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడడంతో.. ప్రిన్స్ ఆ సినిమా వదులుకోవడం సరైనదే అని తేలింది. ఈ సారి మాత్రం మహేష్ బాబుని మెప్పించే కధతో రంగంలోకి దిగాలని భావిస్తున్నట్టు తెసిలింది. త్వరలో ప్రిన్స్ కి శంకర్ కధ చెప్పబోతున్నాడు. శంకర్ ప్రస్తుతం విక్రమ్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయిన తరవాత మహేష్ తో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. మరి మన ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో, లేదో చూడాలి. ఈ సినిమా గనుక పట్టాలేక్కితే… మహేష్ బాలీవుడ్ ఎంట్రీ కుడా ఇదే సినిమాతో జరిగే అవకాశం వుంది.