డిసెంబర్ లో పూరి మూవీ..

ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో భారీ హిట్ అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి..ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న పూరి..డిసెంబర్ లో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. ఈ మూవీ లో విజయ్ కి జోడిగా సోషల్ మీడియా సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.