వెంకీ మామ రిలీజ్ డేట్ ఫిక్స్…

వెంకటేష్ , నాగ చైతన్య హీరోలుగా పాయల్ రాజ్ పుత్ , రాశి ఖన్నా లు హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం వెంకీమామ. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మిగిలి ఉన్న పాట ను చేస్తున్నారట. ఈ సాంగ్ తో షూటింగ్ అంత పూర్తయినట్లే అంటున్నారు.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. డిసెంబర్ మొదటివారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు . కాగా రేపు ఉదయం 11గంటలకి ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్స్ వీడియో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఆ మధ్య ఈ చిత్రం నుండి ఒక చిన్న మేకింగ్ వీడియో వచ్చి సినిమా ఫై అంచనాలు పెంచింది. ఆ వీడియోలో వెంకీ – చైతు లుక్స్ అండ్ మ్యానరిజమ్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీ పాయల్ నటిస్తుండడం తో సినిమా ఫై యూత్ లో ఆసక్తి పెరిగింది. మరి వెంకీమామ వీరిద్దరిని ఎంతవరకు సంతృప్తి పరుస్తాడో చూడాలి.