చరణ్ ఆ నటనను చూసి కంటతడి పెట్టుకున్నాడట..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పక్క అగ్ర హీరోగా రాణిస్తూనే మరోపక్క నిర్మాతగా అడుగులేస్తున్నారు. తాజాగా తన తండ్రి చిరంజీవి తో సైరా నరసింహ రెడ్డి అనే భారీ చిత్రాన్ని నిర్మించారు. సౌత్ పాటు హిందీ లో కూడా ఈ మూవీ అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. ఈ నేపాయడంలో చిత్ర యూనిట్ అంత ఆయా భాషల్లో ప్రమోషన్ చేస్తూ సినిమా ఫై ఆసక్తి నింపుతున్నారు.

తాజాగా చెన్నైలో జరుగుతున్న ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ తనను ఈ మధ్య కాలంలో ఎమోషనల్ గా కంటతడి పెట్టించిన సినిమా కోసం ప్రస్తావించారు.తాను ఇప్పుడు నిర్మాతగా తెరకెక్కించిన “సైరా” లో ఓ కీలక పాత్ర పోషించిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన “96” సినిమా చూసి కంటతడి పెట్టుకున్నానని, ఆ చిత్రంలో విజయ్ సేతుపతి నటన తనను అమితంగా ఆకట్టుకుందని తనని మొదటిసారి కలిసినపుడు ఒక నిమిషం పాటు హత్తుకుని విజయ్ కు అభినందనలు తెలిపానని వెల్లడించారు.