అబ్బా రాశికి ఓ క్యాప్షన్ ఇవ్వండి…

రాశి ఖన్నా..ఈ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీ లో తెగ చక్కర్లు కొడుతుంది. అమ్మడికి పెద్దగా హిట్లు లేనప్పటికీ..అవకాశాలు మాత్రం నిండుగా ఉన్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య – వెంకీ కలయిక లో తెరకెక్కుతున్న వెంకీ మామ చిత్రం తో పాటు మారుతీ – సాయి ధరమ్ తేజ్ కలయికలో తెరకెక్కుతున్న ప్రతి రోజు పండగే చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తుంది. వెంకీ మామ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా..ప్రతి రోజు పండగే మాత్రం జనవరి లో రాబోతుంది.

కాగా తాజాగా రాశి..వెంకీమామ మూవీ లోని ఓ పిక్ పోస్ట్ చేసి దానికి ఓ క్యాప్షన్ ఇవ్వండి అంటూ నెటిజన్లను కోరింది. ఆ పిక్ లో లేడీ కమెడియన్ విద్యు రామన్ చెవుతున్న విషయాన్ని విని షాక్ కి గురైనట్లున్న రాశి పోజ్ ఇచ్చింది. ఇక ఈ రాశి కోరిక మేరకు నెటిజన్లు , అభిమానులు రకరకాల క్యాప్షన్ ఇస్తున్నారు.

బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో నడిచే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందిస్తున్నారు.