మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి చిత్రం మరో నాల్గు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గురువారం విడుదలైన సెకండ్ ట్రైలర్ సైతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుని సినిమా ఫై ఆసక్తి పెంచింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలలో బిజీ గా ఉండగా ..తాజాగా ఈ సినిమా తాలూకా ఓ వార్త అబ్బా అనిపించేలా చేస్తుంది.
ఉయ్యాలవాడ ఇచ్చిన స్పూర్తితో.. ఉత్తరాదిన స్వాతంత్ర ఉద్యమం మొదలౌతుంది. ఝాన్సీ లక్ష్మీభాయ్ బ్రిటిష్ దొరలపై పోరాటం చేస్తుంది. ఝాన్సీ లక్ష్మి భాయ్ పాత్రలో అనుష్క కనిపిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉరి తరువాత ఐదు నిమిషాలపాటు సినిమా నడుస్తుందట. ఈ చివరి ఐదు నిముషాలు అనుష్క కనిపిస్తుంది. అనుష్క పోరాటానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి. ఇక ఎండింగ్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా ముగుస్తుందట. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ లో పవన్ వాయిస్ ఊపిరి పోయగా ..సినిమాకు ప్రాణం పోస్తుందని మెగా అభిమానులు భావిస్తున్నారు.