మంత్రి సన్యాసం సవాల్‌ను స్వీకరిస్తున్నాం : ఎమ్మెల్సీ అశోక్‌

ఏపీ మంత్రి అనీల్‌ కుమార్‌ యాదవ్‌ పోలవరం ప్రాజెక్ట్‌ గురించి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ హయాంలో ఆ పార్టీ అవినీతి కోసం పనులను జాప్యం చేసిందన్నాడు. వైకాపా ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో పోలవరంను పూర్తి చేసి చూపిస్తామని అన్నాడు. తెలుగు దేశం పార్టీ నాయకులు రెండు సంవత్సరాల్లో పోలవరంను పూర్తి చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటూ సవాల్‌ విసిరాడు. తెలుగు దేశం పార్టీ నాయకులు మొత్తం కూడా పోలవరం పూర్తి చేస్తే రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్‌ విసిరాడు.

అనీల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌కు తెలుగు దేశం ఎమ్మెల్యే అశోక్‌ బాబు స్పందించారు. వైకాపా ప్రభుత్వం స్వలాభాల కోసం వైకాపా రివర్స్‌ టెండరింగ్‌ చేసినట్లుగా విమర్శించాడు. వైకాపా నాయకులు భయపెట్టి ఎవరు టెండర్స్‌ వేయకుండా చూసినట్లుగా ఆయన అన్నాడు. పోలవరం రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తే తెలుగు దేశం పార్టీ నాయకులు రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్దం అంటూ అశోక్‌ బాబు అన్నాడు. అనీల్‌ కుమార్‌ యాదవ్‌ అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నాడంటూ అశోక్‌ బాబు ఎద్దేవ చేశాడు.