వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సంచనలమే అవుతుంది. అయితే ఏం చేయకున్నా కూడా అది సంచలనమే. ఏ విషయం గురించైనా ఎవరితో సంబంధం లేకుండా తనదైన స్టయిల్లో స్పందిస్తారు. ఇక అది ఎంత పెద్ద వివాదాం అయినా పట్టించుకోని వర్మ అన్నింట్లో వేలు పెట్టడం గురించి అందరికి తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ హాట్ టాఫిక్ మారినా కూడా వర్మ స్పందించడం లేదు. ట్రయిలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి వర్మ ఏ కామెంట్ చేయడం లేదు.
‘సైరా’ గురించి బాలీవుడ్ స్టార్లు కూడా స్పందిస్తున్నారు. అయితే వర్మ పాజిటివ్‌గా స్పందించిన సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. వివాదాస్పదం అయిన సందర్భాలే ఎక్కువ. మరీ ‘సైరా’ విషయంలో వర్మ ఎందుకు సెలైంట్‌గా ఉంటున్నాడు అని అభిమానులు షాక్ అవుతున్నారు. గతంలో మెగా ఫ్యామిలీకి వర్మకు మాటల యుద్దమే జరిగింది. దానివల్ల అంతర్గత కారణాలేమైనా ఉన్నాయా? ఉన్నా కూడా వర్మ కచ్చితంగా రివేంజ్ కోసమైనా స్పందిస్తాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ‘సైరా’ గురించి స్పందించకపోవడం గమనార్హం. అయితే సినిమా విడుదలయ్యాక తన ట్వీట్ల వర్షం మొదలెడతారా? అనేది చూడాలి.