మెగా ప్రిన్స్ వరుఫ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో ‘గద్దలకొండ గణేష్’ చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. వరుణ్ కెరియర్‌లో మంచి కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటగా ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కానీ కొన్ని సామాజిక వర్గాల వారు ఆ టైటిల్ విషయమై ఆందోళనలు చేపట్టారు దాంతో చేసేది లేక చిత్ర యూనిట్ చివరకు ‘గద్దలకొండ గణేష్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చివరి నిమిషంలో టైటిల్‌లో మార్పులు చేసినా కూడా ప్రేక్షకులకు ఈ బొమ్మ నచ్చింది.
‘గద్దలకొండ గణేష్’ సక్సెస్ అయిన సందర్భంగా మీడియాతో ముచ్చటించిన హరీష్ శంకర్ ఈ సినిమా ద్వారా వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని చాటాలని ప్లాన్ చేశాం కానీ కొందరు అందుకు అడ్డు పడ్డారు. దాంతో చేసేది లేక టైటిల్‌ను మార్చేశాం. హైందవ మతంలో పుట్టిన వ్యక్తిగా, రామాయణం, వాల్మీకి మహర్షిపై ఉన్న గౌరవంతో ఈ చిత్రాన్ని వాల్మీకి మహర్షికి అంకితం చేస్తున్నాం అని హరీష్‌శంకర్ ప్రకటించాడు.