చిరులోని కొత్తకోణం బయటపెట్టిన కోడలు

మెగాస్టార్‌ చిరంజీవి, తనయుడు రామ్‌చరణ్‌లు సినిమాలో పెద్ద స్టార్స్‌ అయినా కూడా మెగా కోడలు ఉపాసన మాత్రం సినిమాల విషయంలో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తారు. అన్ని రంగాల్లో పట్టు ఉన్న ఉపాసన సినిమాలకు మాత్రం దూరంగా ఉంటారు. దాంతో చిరు ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ ప్రీ రిలీజ్‌ వేడుకకు ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ వేడుక కోసం ముద్దుగా రెడీ అయిన ఉప్సీ కొన్ని ఫొటోలకు ఫోజిచ్చారు. అయితే వీటిలో వింతేముంది అనుకుంటున్నారా! వెయిట్‌ ఉపాసన ఫొటో ఒకటి ప్రస్తుతం తెగ హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఆ ఫొటో ఏముంది తెలుసా?

సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్న ఉపాసన ఫొటోని క్లిక్‌ చేసినది మెగాస్టార్‌ చిరంజీవి. ఉప్సీ వెనుక ఉన్న అద్దంలో క్లియర్‌గా చిరు ఈ ఫొటోని క్లిక్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఫొటోని ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో చిరులోని కొత్త కోణాన్ని బయటపెటినట్టు అయింది. స్వయంగా చిరు ఫొటో తీస్తున్నట్టుగా ఫొటోలో క్లియర్‌గా ఉంది. మొత్తానికి కోడలు కోసం తనలోని కొత్త యాంగిల్‌ని బయటపెట్టి అందమైన ఫొటోని తీశారు. ఆ ఫొటోపై మీరు ఓ లుక్కేయండి.