అఖిల్ అక్కినేని ‘అఖిల్’ చిత్రంతో తెరంగేట్రం చేసి అభిమానులను నిరాశ పరిచాడు. ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో అక్కినేని అభిమానులు అఖిల్ నుండి ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. నాగార్జున కూడా అఖిల్‌కి ఓ బ్లాక్ బస్టర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. అఖిల్ నాలుగో చిత్రం అనేక చర్చల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగానే అఖిల్ తన తదుపరి చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు.
‘అ’ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవలె అఖిల్‌కు ఓ కథను వినిపించాడట. ఆ కథ బాగా నచ్చడంతో అఖిల్ ప్రశాంత్ వర్మకి ఒకే చెప్పే ఆలోచనలో ఉన్నాడు. స్టోరీ లైన్ ఆకట్టుకునేలా ఉండడంతో నాగ్, అఖిల్‌లు ప్రశాంత్ వర్మకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రశాంత్ వర్మ కాజల్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యం అవడంతో అఖిల్‌ని లైన్లో పెట్టినట్టుగా సమాచారం. అయితే అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి ఉండాల్సిందే.