చెర్రీ వర్సెస్‌ బన్నీ… నిజమేనా?

మెగాస్టార్‌ చిరంజీవి ద్వారా నాగబాబు, పవన్‌కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌లు అంతా కూడా మెగా హీరోలంటూ ప్రత్యేకంగా పిలువబడతారు. ఇక వీరందరికి ఒక్కో స్టార్‌ ఇస్తూ అభిమానులు మెగా హీరోలందరిని స్టార్స్‌ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్‌ మాత్రం ఒక్కోసారి తన రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తారు. తాజాగా చిరు నటించిన ‘సైరా’ ప్రీ రిలీజ్‌ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పవన్‌, వరుణ్‌, సాయిధరమ్‌ తేజ్‌లు హాజరయ్యారు. కానీ అల్లు అర్జున్‌ మాత్రం రాలేదు. సిటీలో ఉండి కూడా రాత్రి ఎనమిది గంటలకి జరిగే వేడుకకు రాకపోవడం గమనార్హం.

వేడుకకు గైర్హాజరు అవడమే కాకుండా నాలుగు రోజుల క్రితం విడుదలయిన ‘సైరా’పై స్పందించలేదు. బాలీవుడ్‌ స్టార్‌లు స్పందించిన ఈ ట్రైలర్‌పై బన్నీ కామ్‌గా ఉండడం విశేషం. కనీసం సోషల్‌ మీడియాలో షేర్‌ కూడా చేయలేదు. దాంతో బన్నీ, చెర్రీల మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు బన్నీ రాకపోవడం వల్ల అల్లు అరవింద్‌ మాట్లాడడానికి ప్రయత్నిస్తే అభిమానులు చేతులు ఊపుతూ నిరాకరించారు. ఇక దీన్నిబట్టి  చెర్రీ వర్సెస్‌ బన్నీ ఫైట్‌ ఓ రేంజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.