వరుణ్ తేజ్ ఇంకా అథర్వ హీరోలుగా నటించిన ‘వాల్మీకి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విడుదలకు చివరి నిమిషంలో ఈ చిత్రం టైటిల్‌ను మార్చడం జరిగింది. గద్దలకొండ గణేష్ టైటిల్‌తో ఈ చిత్రం విడుదల అయ్యింది. సినిమా టైటిల్ గందరగోళం మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. అంచనాలు భారీగా ఉన్న ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. మొత్తంగా చూసుకుంటే సినిమాకు పబ్లిక్ యావరేజ్ సినిమా అంటూ ముద్ర వేశారు.
మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్‌ను ఇలా చూడటం సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అథర్వ మరియు పూజా హెగ్డేల విషయంలో కూడా ప్రేక్షకులు చాలా పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ను అనుకున్నట్లుగానే ప్రేక్షకులు చూడటంతో సంతృప్తి చెందుతున్నారు. వాల్మీకి చిత్రం ఒక సారి చూడదగ్గ చిత్రం అంటూ ప్రేక్షకుల నుండి టాక్ దక్కించుకుంది. మెగా ఫ్యాన్స్ అయితే సూపర్ హిట్ అంటున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్‌కు మరో మంచి సినిమా పడ్డట్లే అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇక కలెక్షన్స్ పరిస్థితి ఏంటో చూడాలి.