రొమాంటిక్ గా రెచ్చిపోయిన రాహుల్‌, హిమజ

బిగ్‌బాస్‌ 3లో మొదటి నుండి రాహుల్‌, పునర్నవిల మధ్య కాస్త చనువు పెరుగుతూనే ఉంది. దాంతో అంతా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్‌ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. తాజాగా జరిగిన కాలేజ్‌ టాస్క్‌లో భాగంగా ఇంట్లోని ఆడ సభ్యులతో మగ సభ్యులు జంటలుగా ఏర్పడి లవ్‌ ప్రపోజ్‌ చేయాలి. అయితే ఈ టాస్క్‌లో వితికా, బాబా భాస్కర్‌లు జడ్జ్‌లుగా వ్యవహరించారు. రవి, శ్రీముఖి లవ్‌ ప్రపోజల్‌ క్యూట్‌గా సాగింది.

పున్ను, మహేష్‌ల ప్రపోజల్‌ కాస్త ఘాటుగానే ఉంది. ఇకపోతే హిమజ, రాహుల్‌ల లవ్‌ స్వీట్‌ అండ్‌ సాల్ట్‌గా, సూటిగా సుత్తి లేకుండా బాగుందని వితికా, బాబా హిమజ, రాహుల్‌లను బెస్ట్‌ కపుల్‌గా ఎంపిక చేశారు. బెస్ట్‌ కపుల్‌ మనోహరా… నా హృదయమునే…అనే పాటకు రొమాటింక్‌గా డ్యాన్స్‌ చేయాల్సి వచ్చింది.

మొదట్లో రాహుల్‌ కాస్త సిగ్గుపడ్డాడు. ఇక హిమజ పాటకు తగ్గట్టుగా రొమాంటిక్‌ ఫేస్‌తో స్టెప్పులేసింది. కంటెస్టెంట్ల ఎంకరేజ్‌తో రాహుల్‌ కూడా చివరికి రెచ్చిపోయాడు.  బాబా మాస్టర్‌ భ్యాక్‌ ఉండి స్టెప్పులను గైడ్‌ చేశాడు. హిమజ ను ఎత్తుకుని కూడా స్టెప్పులేశాడు. అది చూసిన పున్ను కూడా చాలా ఎంజాయ్‌ చేసింది. ఇద్దరి రొమాన్స్‌ను కేకలు పెడుతూ మరీ ఎంజాయ్‌ చేసింది. ఇంటి సభ్యులు కూడా ఈ రొమాంటిక్‌ డ్యాన్స్‌ను చూసి తెగ మురిసిపోయారు.