మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ చిత్రంతో సెప్టెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా చురుగ్గా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. వరుణ్‌కు చిరుని తెరపై చూడడం అంటే చాలా ఇష్టమట. అంతేకాకుండా తాను కూడా ట్రయిలర్ కోసం సాయంత్రం ఎప్పుడెప్పుడవుతుందా? అని ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే తనకు ఓ పీరియాడిక్ సినిమా చేయాలనుందని, కథ ఉంటే కచ్చితంగా అలాంటి సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. చిరు బయోపిక్ గురించి కూడా వరుణ్ స్పందించాడు.
చిరు బయోపిక్ తీసే అవకాశం వస్తే చేస్తారా? అని అడగగా అది చరణ్ అన్న చేస్తేనే బావుంటుంది. ఒకవేళ అన్న చేయకపోతే లిస్ట్‌లో నెక్ట్స్ తనపేరే ఉంటుందని చెప్పుకొచ్చాడు. హరీష్ శంకర్‌కి కూడా చిరు బయోపిక్ చేయాలని ఉందట. ఆ విషయాన్ని వరుణ్ దగ్గర ప్రస్తావించినట్టుగా చెప్పుకొచ్చాడు. పెద్దనాన్న రోల్ చేయాలంటే ఛాలెంజింగ్ కానీ బయోపిక్ చేయాల్సి వస్తే చరణ్ అన్న తర్వాత నేనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు. ‘వాల్మీకి’ చిత్రం తమిళ సినిమా ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే రొమాన్స్ చేసింది.