బోయపాటి అతి గురించి అందరికి తేల్సిందే

‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలతో మంచి హిట్లను సొంతం చేసుకున్న బోయపాటి ఆ తర్వాత చెన్పుకోదగ్గ సక్సెస్‌లను అందుకోలేదు. ఏదో అనుకుని చాలా భారీగా ప్లాన్‌ చేస్తాడు. కానీ చివరకు బెడిసి కొట్టి నిర్మాతలకు కూబా భారీ నష్టాలే మిగులుతాయి. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టించి నష్టాలనే మిగుల్చుతాడు అనేది అందరికి తెల్సిందే. సినిమాలోని పలు సన్నివేశాలనే ఇక్కడే చిత్రీకరించే లొకేషన్‌లు ఉన్నా కూడా విదేశాలకు తీసుకెళ్లి భారీ బడ్జెట్‌ని కేటాయిస్తాడు. ఆ సన్నివేశాల వల్ల సినిమాకు పెద్దగా ఒరిగేది కూడా ఏం ఉండదు. ఇటీవలె బాలయ్యతో మరో సినిమా ఫిక్సయింది.

బాలయ్య బోయపాటితో ఇప్పటికే ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ‘వినయ విధేయ రామ’ తర్వాత తారుమారైంది. బాలయ్య రవికుమార్‌ కంటే ముందే బోయపాటి సినిమాలో చేయాల్సింది. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్‌తో బోయపాటి కథను ప్లాన్‌ చేశాడు. దాంతో బాలయ్య అప్పుడు నో చెప్పాడు. ఇప్పుడు బాలయ్య మనసు గెలిచి మరో సినిమా చేయడానికి ఎట్టకేలకు బాలయ్యను ఒప్పించాడు. ఇక బోయపాటి ఈసారి బాలయ్యతో ఎంత ఖర్చు చేయిస్తాడో అనేది ఆసక్తికర విషయం, ఎందుకంటే సినిమా తిరిగి అంత మొత్తాన్ని రాబట్టుకోవాలి కదా!