రౌడీ కోసం గోవా వెళ్తున్న పూరీ

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ హిట్‌తో పూరీకి కాస్త జోష్‌ వచ్చిందని చెప్పవచ్చు. దాంతో తదుపరి చిత్రాన్ని రౌడీస్టార్‌ విజయ్‌ దేవరకొండతో ప్లాన్‌ చేశాడు. విజయ్‌ ప్రస్తుతం క్రాంతి మాధవ దర్శకత్వంలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత రౌడీ హీరో పూరీ దర్శకత్వంలో నటించనున్నాడు. దాంతో పూరీ రౌడీ హీరోకి సంబంధించిన కథని రెడీ చేసే పనిలో పడ్డాడు. పూరీ తన సినిమాలకు స్క్రిప్టును రెడీ చేసేందుకు బ్యాంకాక్‌ వెళుతూ ఉంటాడు.

అప్పుడప్పుడు గోవాకి కూడా వెళతాడు. విజయ్‌ సినిమా కోసం పూరి గోవా చెక్కేస్తున్నాడు. అక్కడ ప్రశాంతమైన వాతావారణంలో స్క్రిప్టును రెడీ చేయనున్నాడు. గోవా వెళ్లడానికి సన్నాహాలు షురూ చేసినట్టు సమాచారం. రౌడీ పూరీ తెరకెక్కించే చిత్రాన్ని పూరీ, చార్మీలు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.