చందమామకు మేకప్‌ ఎందుకు?

‘చందమామ’ చిత్రంతో తెలుగు వారి హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో అందం, అభినయం ఉన్నా కూడా కొన్ని రోజులకే అవకాశాలు కొరవడ్డాయి. చేతినిండా ప్రాజెక్ట్‌లు లేకున్నా కూడా ఖాళీగా లేకుండా అందివచ్చిన అవకాశాలను వాడుకుంటోంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఓ బాలీవుడ్‌ చిత్రంలో కూడా నటిస్తోంది. తాజాగా విమానాశ్రయంలో కాజల్‌ తళుక్కుమంది.

రెడ్‌ గౌన్‌తో మేకప్‌ లేకుండా చాలా సింపుల్‌గా మెరుస్తోంది. చాలా నాచురల్‌గా మొహానికి ఏ మేకప్‌ ముసుగు లేకుండా చేతిలో బుక్‌ పట్టుకుని పక్కింటి అమ్మాయిలా నవ్వుతూ తళుక్కుమంది. దాంతో ఈ ఫొటోను చూసిన అభిమానులు చందమామకు మేకప్‌ ఎందుకు? వయస్సు పెరిగినా తెలియకుండా అందం కూడా పెరుగుతుందా? అని కామెంట్‌లు చేస్తున్నారు.