ప్రముఖ నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. కేవలం సినీ రంగంలోనే కాకుండా రాజకీయ, వ్యాపార రంగంలో కూడా ఆయన ప్రముఖులు. దాదాపు అన్ని సినీ రంగాలతో ఈయనకు మంచి అనుబంధం ఉంది. అందుకే టీఎస్సార్ని కళాబంధు అని అంతా పిలుచుకుంటారు. ఈయన పుట్టిన రోజు కార్యక్రమంలో సహజ నటి జయసుధకు అభినయ మయూరి పురస్కారాన్ని అందిస్తున్నారు. కాగా ఈ సందర్భంగా టీఎస్సార్ కుర్రహీరోలపై ఘాటుగా స్పందించారు. ప్రపంచాన్ని మరిపించేది సినిమా. అలాంటి సినిమాలను చేసే వారు దైవ సంబంధింకులు.
దైవ సంబంధికులు అంటే చాలా పద్దతిగా, క్రమశిక్షణతో నడుచుకోవాలి. కానీ నేటి తరం కుర్రహీరోలు మాత్రం ఆకాశం నుండి దిగి పడినట్టుగా చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. క్రమశిక్షణతో మెలిగితేనే సుదీర్ఘ కాలం ఈ రంగంలో రాణించవచ్చు అంటూ కుర్రహీరోల ప్రవర్తనపై ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్, ఏయన్నార్, చిరంజీవిలు క్రమ శిక్షణతో ప్రజలతో మమేకమై ఉండేవారు. అందుకే వారు అంత గొప్ప స్థాయికి ఎదిగారు. నేను అన్ని రంగాల్లో అనుభవం ఘడించిన కాబట్టి చెబుతున్నానను మంచి నడవడి, పబ్లిక్‌తో మంచి సంబంధాలు ఉంటేనే ఈ రంగంలో మంచి జీవితం ఉంటుంది అంటూ టీఎస్సార్ యువ హీరోలకు మరోసారి క్లాస్ పీకారు.