మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా ‘సైరా’. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ప్రస్తుతం ప్రీ రిలీజ్ వేడుక కోసం ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెల 18న నిర్వహించాలనుకున్న ప్రీ రిలీజ్ వేడుక రెండు రోజులు ఆలస్యంగా జరిగే సూచనలు ఉన్నాయి.
హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరుగనుంది. అయితే మరో రెండు రోజుల్లో వాతావరణం సహకరించే పరిస్థితి లేదు. ఓపెన్ ఫ్లాట్‌ఫాంపై వర్షం పడుతుండగా ఈవెంట్‌ను సజావుగా నిర్వహించడం చాలా కష్టతరం. అంతేకాకుండా వీకెండ్ అయితే అభిమానుల నుండి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 22న వీకెండ్లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే పూర్తి క్లారిటీ కోసం అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే.