మెగాస్టార్ కు మెగా కానుక..

బాలీవుడ్ మెగా స్టార్ – టాలీవుడ్ మెగా స్టార్ ల మధ్య స్నేహ సంబంధం ఈరోజుది కాదు..గత కొంతకాలంగా ఉంది. అందుకే చిరు అడుగగానే సైరా సినిమాలో నటించాడు బిగ్ బి. చిరు తాను నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కీలక పాత్ర చేయాలని అడగ్గానే క్షణం కూడా ఆలోచించకుండా అమితాబ్ ఓకే చెప్పేశారు. పైగా చిరు ప్రత్యేకంగా అమితాబ్‌ను కలిసి మరీ సినిమాలో నటించమని అడగలేదు. కేవలం ఒక్క మెసేజ్‌తోనే సినిమాకు ఒప్పుకొన్నారు. ఆలా చేసిన బిగ్ బి కి ఏం చేసిన తక్కువే..కానీ ఏదో ఒకటిటి చేయాలనీ అనుకున్నాడు.

అందుకే ఆయనకు బంగారు ఆభరణాలను గిఫ్ట్ గా ఇచ్చారట. వీటిని చిరు పెద్ద కుమార్తె సుస్మిత డిజైన్ చేసిందట. వాటి ఖరీదు కూడా ఎక్కువే అని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక సైరా విషయానికి వస్తే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత కథగా తెరకెక్కడం జరిగింది. అక్టోబర్ 02 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.