హెలికాప్టర్ల కొను’గోల్ మాల్’ పై సీబీఐ విచారణ : ఆంటోని

italian-chopperదాదాపు 3600 కోట్ల రక్షణ హెలికాప్టర్ ఒప్పందంలో భారత అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు భారీగా లంచాలు ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటలీ సంస్థ ‘ఫిన్ మెకానిక’ ఛైర్మెన్ గిసెప్పీ ఓర్సీని అక్కడి అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. తాజా గా భారత రక్షిణ శాఖమంత్రి దీనిపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే ‘ఫిన్ మెకానిక’ సంస్థ ఛైర్మెన్ గిసెప్పీ ఓర్సీని అక్కడి రక్షిణ మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేశారు. సీఈవో బ్రూవో స్పాగ్నోలినీని గృహ నిర్బంధంలో ఉంచారు. తాజా పరిణామలతో భారతరక్షణ శాఖ ఒక్కసారిగా అప్రమత్తమయింది. రాష్ర్టపతి, ప్రధానమంత్రి, ఇతర వీవీఐపీల అవసరాల కోసం 12 హెలికాఫ్టర్లను కొనుగోలు చేయాలని వైమానిక దళం నిర్ణయించింది.

ఈ మేరకు 2010 ఫిబ్రవరిలో భారత వైమానిక దళానికి, ఫిన్ మెకానికాకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి భారత ఆర్థిక శాఖ అంగీకారం తెలపనప్పటికీ.. కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ఒప్పందం మేరకు ఇప్పటికే మూడు హెలికాప్టర్లు భారత్ కు చేరాయి. ఈ వివాదంలో అవినీతి కుంభకోణం బయటపడ్డప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని తమ కార్యకలాపాలు యధావిథిగా కొనసాగుతాయని ప్రకటించింది.
కాగా, వరుస కుంభకోణాలలో కొట్టుమిట్టాడుతున్న యూపీఏ ప్రభుత్వానికి తాజాగా వెలుగులోనికి వచ్చిన ఈ తాజా భారీ కుంభకోణం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.