స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగుతో పాటు పలు భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈయన సినిమాలు టాలీవుడ్లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా సక్సెస్‌ను దక్కించుకుంటున్నాయి. హిందీలో బన్నీ డబ్బింగ్ చిత్రాలకి వ్యూస్ భారీగా వస్తున్నాయి. అంతేకాకుండా రాజమౌళి చిత్రంతో ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్‌కు పరిచయం కాగా, చరణ్, ఎన్టీఆర్‌లు బాలీవుడ్లో తమ జెండా పాతడానికి క్యూలో ఉన్నారు. దాంతో తాను కూడా బాలీవుడ్లో పాగా వేయాలని బన్నీ చూస్తున్నాడు. త్వరలోనే పాన్ ఇండియా కథతో ఓ ప్రాజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
తన దగ్గరకు వస్తున్న దర్శకులకు కూడా పాన్ ఇండియా కథతో రావాలని సూచిస్తున్నాడు. దాంతో బాలీవుడ్లో స్ట్రయిట్ సినిమా చేసి తన లక్‌ను పరీక్షించుకోవాలని చూస్తున్నాడు. అయితే అది అంత ఈజీ కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. చరణ్ ఇప్పటికే ‘జంజీర్’ చిత్రంతో హిందీ ప్రేక్షకుల దగ్గర చేదు అనుభవాలను రుచి చూశాడు. ఇప్పుడు రాజమౌళి సాయంతో మళ్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి ధైర్యం చేస్తున్నాడు. అయితే రాజమౌళి లేకుండా బన్నీ ప్లాన్ చేస్తే అది ఎలా ఉంటుంది అనేది చెప్పలేం. పాన్ ఇండియా కథల పట్ల మిగతా వారితో పోల్చితే రాజమౌళికి ఉన్న నైపుణ్యం వేరు. బన్నీ కన్ను బాలీవుడ్ మీద పడింది కాబట్టే ‘ఐకాన్’ను అటకెక్కించినట్టు తెలుస్తోంది.