తల్లిదండ్రుల గురించి చెబుతూ ఎమోషనల్‌ అయిన అమలా

పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అమలా అక్కినేని నాగార్జునను వివాహమాడాక సినిమాలకు దూరం ఉంటూ వస్తున్నారు. చాలా గ్యాప్‌ తీసుకుని ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా అమలా తన తల్లిదండ్రుల గురించి ఫుల్‌ క్లారిటీ ఇస్తూ చాలా ఎమోషనల్‌ అయింది. అమలా తల్లిదండ్రుల విషయంలో చాలా పుకార్లు వస్తున్నాయి. దాంతో వాటిని ఖండిస్తూ తల్లిదండ్రులు వారి వృత్తులను అందరితో పంచుకుంది.

మా అమ్మ ఐరిష్‌ మహిళ. కానీ చూడడానికి అచ్చం భారతీయురాలిలాగే ఉంటారు, కొందరు భారతీయుల కంటే మీ అమ్మ అసలైన భారతీయురాలిలా ఉంటుందని మా అత్తగారు అంటుండేవారు. నాన్నగారు భారతీయుడే, పుట్టింది ఈస్ట్‌ బెంగాల్‌లోని ఢాకా కానీ పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోనే. నౌకాదళంలో పనిచేశారు. ఈస్ట్‌ బెంగాల్‌ బంగ్లాదేశ్‌గా మారక ముందు సంగతి ఇది. కాబట్టి చరిత్రను అర్థం చేసుకోవాలి, అప్పుడే దేశ విభజన వల్ల కలిగిన బాధ, నష్టాలు అర్థం అవుతాయి. కమాండర్‌ ఎమ్‌కె ముఖర్జీ భారతీయుడు, బెంగాలీ అంటు తల్లిదండ్రుల గురించి చెబుతూ అమలా ఎమోషనల్‌ అయింది.