తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 చాలా డల్‌గా సాగుతోంది. ప్రతి టాస్క్ కూడా ఇంటి సభ్యులు సీరియస్‌గా తీసుకోకుండా ఆడుతున్నారు. టాస్క్‌ల విషయంలో ఇప్పటికే పలు సార్లు బిగ్‌బాస్ హెచ్చరించినా కూడా ఇంటి సభ్యులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ వారం కూడా ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే టాస్క్‌ను చాలా లైట్‌గా తీసుకున్నారు. అందుకు పనిష్మెంట్ కూడా ఇంటి సభ్యులు తీసుకున్నారు. అయితే నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్లో నాగార్జున చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు.
సాదారణంగా డాన్స్‌తో మొదలు పెట్టే నాగార్జున డాన్సర్స్ డాన్స్ వేస్తుంటే అక్కర్లేదు మీరు వెళ్లండి. ఈ రోజు చాలా సీరియస్‌గా ఇంటి సభ్యులతో మాట్లాడాలి అంటూ డాన్సర్స్‌ను పంపించడం జరిగింది. నాగార్జున మరీ ఇంత సీరియస్ అవ్వడంతో ఇంటి సభ్యులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలేం జరిగి ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున నేటి ఎపిసోడ్లో ఏం మాట్లాడబోతున్నాడు అనే విషయం చర్చనీయాంశం అయ్యింది. మరి కొన్ని గంటల్లో ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌పై అందరి దృష్టి కెంద్రీకృతం అయ్యింది.