ఎటువంటి పాత్రలో అయినా సునాయాసంగా పరకాయ ప్రవేశం చేసి నాచురల్ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నాని తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంపై నాని అభిమానులకు అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాని ఓ ఇంటర్య్వూలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా సినిమా విడుదలకు ముందు మీ పరిస్థితి ఏంటి? దానిని ఎలా హ్యాండిల్ చేస్తారు అనే ప్రశ్నకు వెరైటీగా సమాధానం ఇచ్చారు.
చాలామంది హీరోలు తమ సినిమాల విడుదలకు ఒకట్రొండు రోజుల ముందు చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. అందువల్ల ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. కానీ నాని మాత్రం ఆ టెన్షన్‌ని చాలా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చారు. అప్పుడు ఉండే టెన్షన్, నమ్మకం, భయం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఫీల్ సినిమా విడుదలయిన సాయంత్రం వరకు కూడా ఉండదు. కాబట్టి విడుదలకు ఒకట్రొండు రోజుల ముందు నుండే నేను దానిని ఎంజాయ్ చేస్తాను. అందులో ఉండే కిక్కే వేరు. ఆ కిక్ కోసమే నేను సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.