పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి అంటున్న హీరోయిన్‌

సౌత్‌లో తనదైన పాత్రల్లో నటించి మెప్పించిన సొట్టబుగ్గల చిన్నది తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. తెలుగు, తమిళంలో అవకాశాలు తగ్గిపోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్‌ చెక్కేసి అక్కడ లేడి ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటిస్తోంది. తాప్సీ నటించిన బాలీవుడ్‌ చిత్రాలు సక్సెస్‌ అవడంతో ఈ అమ్మడి కెరియర్‌ ప్రస్తుతం పర్వాలేదన్నట్టుగానే ఉంది. తాప్సీ ప్రేమ గురించి గతంలో చాలా వార్తలు ప్రచారం అయ్యాయి. తెలుగు, తమిళంలో ఈ అమ్మడికి హీరోలతో ఎఫైర్‌ ఉందంటూ పుకార్లు షికారు చేశాయి.

చెన్నైలో తాప్సీ, సదరు తమిళ హీరో కొట్టుకున్నారని, ఈ వ్యవహారమంతా కూడా ఓ పబ్‌లో జరిగిందని కోళీవుడ్‌ మీడియా కోడై కూసింది. ఆ తర్వాత చేసేది లేక బాలీవుడ్‌ వెళ్లిన ఈ భామకు తన చెల్లెలి ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడట. ప్రస్తుతం అతనితో ప్రేమలో ఉన్నానని, ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటోంది. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి చేసుకుంటాం, అప్పటివరకు ఇలా హాయిగా ఉంటాం, ఇలా ప్రేమికులుగా ఉండడం కూడా చాలా హ్యాపిగా ఉందంటూ తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది