సౌత్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఈయన సినిమాలు తెలుగులో పెద్దగా ఆడకపోయినా కూడా అభిమానుల సంఖ్య మాత్రం అలాగే ఉంది. ప్రొఫెషనల్ లైఫ్‌లో మంచి పేరున్నా సూర్య పర్సనల్ లైఫ్ ద్వారా కూడా మంచి పేరును సొంతం చేసుకున్నారు. 2006లో నటి జ్యోతికను ప్రేమ వివాహమాడారు. వీరికి పాప దియా, దేవ్‌లు ఉన్నారు.
తాజాగా వీరి వివాహవార్సికోత్సవం సందర్భంగా సింపుల్‌గా కేక్ కట్ చేశారు. ఫ్యామిలి మొత్తం సాదారణ వస్త్రాధారణలో ఉన్నారు. పిల్లలిద్దరు కూడా బ్యాట్మింటన్ ఆడుతూ మధ్యలో వీరి కేక్ కటింగ్‌కి హాజరయినట్టుగా కనిపిస్తున్నారు. పిల్లల దృష్టి కేక్ మీద ఉండగా సూర్య మాత్రం కెమెరావైపు చూస్తు స్టిల్ ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏమాటకామట కానీ ఈ స్టార్హీరో ఫ్యామిలి అంతా కూడా భలే క్యూట్‌గా ఉన్నారు. మీరు కూడా వీరిపై ఓ లుక్కేయండి.