పున్నుకి బిగ్‌బాస్‌ కంటే వరుణే ఎక్కువ?

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ముద్దుగుమ్మ పునర్నవి భూపాలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్యూట్‌ క్యూట్‌ అందాలతో పాటు తనదైన రీతిలో ఈ అమ్మడు ప్రవర్తిస్తూ ఉంటుంది. సైకాలజి చదివిన పున్ను కొన్ని విషయాల్లో వింతగా ప్రవర్తించడంతో ఈ అమ్మడిపై అందరికి ప్రత్యేక దృష్టి పడింది. ఇకపోతే బిగ్‌బాస్‌కు నేను అసలు భయపడను అంటూ చాలా సూటిగా చెబుతూ ఉంటుంది. ఇంట్లో తోటి కంటెస్టెంట్‌ రాహుల్‌తో కాస్త చనువుగా ఉంటూ ప్రేక్షకుల్లో క్రేజీగా మారిపోయింది. అయితే టాస్క్‌ల విషయంలో కూడా పున్ను రూటే సపరేటు.

గతంలో ఎలిమినేషన్‌కి నామినేట్‌ సందర్భంగా తాను చాలామందితో క్లోజ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నా కూడా తాను ఎవరికి క్లోజ్‌గా లేదు అంటూ పలువురు ఈ అమ్మడిని నామినేట్‌ చేశారు. దాంతో ఆగ్రహించిన పున్ను తనకు తానే నామినేట్‌ అయింది. అలా చేస్తే సీజన్‌ మొత్తం నామినేట్‌ అవుతారు అంటూ బిగ్‌బాస్‌ హెచ్చరించినా కూడా బిగ్‌బాస్‌ మాటను ఖాతరు చేయలేదు. దాంతో అప్పుడు వరుణ్‌, పున్నుని పక్కకి తీసుకెళ్లి వివరంగా మాట్లాడడంతో బిగ్‌బాస్‌ చెప్పినట్టు చేసింది.

తాజాగా ఇంట్లో దెయ్యం నాకేం భయం టాస్క్‌లో అత్యంత చెత్త ప్రదర్శణ ఇచ్చినందుకు గాను పునర్నవి, శ్రీముఖి, మహేష్‌లకు శిక్షగా షూష్‌ పాలిష్‌ చేసే టాస్క్‌ను ఇచ్చారు. శ్రీముఖి వెంటనే దానిని స్వీకరించింది. మహేష్‌ మొదట్లో నో అన్నా కూడా శివజ్యోతితో మాట్లాడగానే టాస్క్‌కి ఒకే చెప్పాడు. కానీ పున్ను మాత్రం ఆ టాస్క్‌కి ససేమిరా అన్నది. శ్రీముఖి, మహేష్‌లు టాస్క్‌ పూర్తి చేసినా కూడా పున్ను అలాగే కూర్చుంది తప్పా తాను రెడీగా లేనన్నది. పున్నుతో చాలాసేపు మాట్లాడిన వరుణ్‌ ఎట్టకేలకు పున్నుని ఒప్పించింది. ఈ శిక్షను స్వీకరించకపోతే వచ్చే వారం నామినేట్‌ అవాల్సిందని బిగ్‌బాస్‌ హెచ్చరించినా కూడా వినని పున్ను వరుణ్‌ మాటలకు మరోసారి తలొగ్గొంది. దాంతో పున్నుకి బిగ్‌బాస్‌ కంటే వరుణే ఎక్కువయ్యాడు అంటూ నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు.