ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం రెండు పార్ట్లు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను అలరించింది. ఎన్నో దేశాల్లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ఇలాంటి నేపథ్యంలో ఇంకా పలు అవార్డులు మరియు రివార్డులు దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని రాయల్ ఆల్బెర్ట్ హాల్లో ఈ చిత్రంను ప్రదర్శించేందుకు సిద్దం అవుతున్నారు.
అక్టోబర్ 19, 2019న బాహుబలి మొదటి పార్ట్‌ను ప్రఖ్యాత లండన్ రాయల్ ఆర్బెర్ట్ హాల్లో ఈ చిత్రంను ప్రదర్శించబోతున్నారు. చాలా అరుదుగా మాత్రమే అక్కడ సినిమాలు ప్రదర్శింపబడుతాయి. అక్కడ సినిమా ప్రదర్శించారు అంటే ఆ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా చర్చించుకుంటారు. రాయల్ సినిమాగా బాహుబలికి లండన్ ప్రభుత్వం అరుదైన గౌరవం ఇవ్వబోతుంది. ఈ ప్రదర్శణకు చిత్ర నిర్మాతలు మరియు ముఖ్య టెక్నీషియన్స్ హాజరు కావాలంటూ అక్కడ నుండి ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది.